Nani: నాని 'ది ప్యారడైజ్' మూవీలో మరో టాలీవుడ్ హీరో కీరోల్... 4 d ago

నేచురల్ స్టార్ నాని సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ మూవీస్ చేసి నేచురల్ స్టార్ గా మారిపోయారు. పోయిన ఏడాది నాని 'సరిపోదా శనివారం' చిత్రంతో ఘన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం ఆయన ఓ రెండు భారీ ప్రాజెక్ట్ లతో మన ముందుకి రాబోతున్నారు. నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ ది ప్యారడైజ్, హిట్-3. ఈ రెండు మూవీస్ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. 'దసరా' హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఈ సినిమాలో నాని ఫ్రెండ్గా టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించబోతున్నట్లు టాక్. అయితే 'ది ప్యారడైజ్' కోసం శ్రీకాంత్ ఓదెల కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'దసరా' కంటే పెద్ద హిట్ ని నానికి ఇవ్వాలని అనుకుంటున్నారు.